తల్లికి వందనం పై తాజా నిర్ణయం! అమలు ప్రక్రియ ప్రారంభం! ఎప్పటి నుండి అంటే?

  Thu Apr 03, 2025 10:53        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తల్లికి వందనం పథకాన్ని వచ్చే నెల మేలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ప్రతి తల్లి ఖాతాలో పిల్లల సంఖ్యకు అనుగుణంగా రూ. 15,000 చొప్పున నిధులు జమ చేయనున్నారు. ఇందు కోసం ఇప్పటికే బడ్జెట్‌లో నిధులు కేటాయించగా, అర్హతలు మరియు మార్గదర్శకాలపై కసరత్తు కొనసాగుతోంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని 81 లక్షల విద్యార్థుల్లో 69.16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందే అవకాశం ఉంది.

 

ఇది కూడా చదవండి: నేడే ప్రారంభం! దశాబ్దాల సమస్యకు పరిష్కారం! లోకేష్ ధృఢ నిశ్చయం!

 

ఈ రోజు (గురువారం) జరగనున్న ఏపీ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, డ్రోన్ పాలసీ, భూకేటాయింపులు, అమరావతి పనుల ప్రారంభం, ప్రధాని మోదీ పర్యటన వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ. 20,000 జమ చేయాలని నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు రుణం తొలి విడత నిధులు విడుదల కావడంతో, అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా చర్చించనున్నారు. టెండర్లు ఖరారు చేయడంతో, ఈ నెల మూడో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం ఉంది.

 

ఇదే సమయంలో, డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. జూన్ 12 నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తి చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుండగా, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు, కారు కలిగినవారు, మరియు అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకంటే ఎక్కువ స్థలమున్నవారిని పథకం నుండి మినహాయించారు. నిబంధనలపై కేబినెట్ భేటీలో స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్! మూడు వాల్వ్స్ లో సమస్యలు..

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీపవన్ కల్యాణ్నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #ThalliKiVandanam #AnnadataSukhibhava #AmaravatiDevelopment #DSCNotification #AndhraPradeshProgress #GovernmentSchemes #ModiInAmaravati #StudentWelfare